మంత్రి రోజాకి ఇంటి పోరు.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కనిపిస్తున్న షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. అసలు రోజాకి ఈసారి జగన్ టికెట్ కేటాయించరనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ రోజా మాత్రం ఈసారి నగరి టికెట్ నాకే అనే ధీమాని వ్యక్తం చేస్తుంది. తరచూ అదే చెప్పుకుంటూ వస్తుంది. నేను నగరి అభివృద్ధి కి ఎంతో చేశాను, జగన్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరికి టికెట్ ఇస్తారు అంటూ చెప్పుకుంటుంది. కానీ రోజా పై ఆమె పార్టీ నేతలే అలిగేషన్స్ చేస్తున్నారు.
ఈలోపులో జబర్దస్త్ ప్రేక్షకులకు శుభవార్త... 🤣🤣🤣, నగరిలో మంత్రిరోజా ఇంటిపోరు, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా రోజా, ఆమె సోదరుల్లా దోచుకోలేరని ఫైర్.. రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న వ్యతిరేకవర్గం, రోజాకు తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామంటున్న అసమ్మతివర్గం.. అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ లు పెడుతున్నారు.
మరోపక్క మంత్రి రోజాకి వెన్నుదన్నుగా ఉండే ఆమె భర్త సెల్వమణి రోజా ని వ్యతిరేఖించేవారిని చల్లబరిచే పనిలో ఉన్నాడు. నగరిలో ఒంటరి అయిన రోజాకి తన భర్త సెల్వమణి తోడుగా బండి నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రోజా భర్త సెల్వమణితో కలిసి తనతో పాటు నడిచే కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రోజాను వ్యతిరేకిస్తున్న నేతలకు తాము ఎంత మంచి చేశామో చెప్పుకొచ్చారు. అయితే తమిళ ఉద్యమకారుడు అయిన సెల్వమణి ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ తమిళంలో ప్రసంగాలు చేస్తున్నారు.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.