దాదాపుగా టాలీవుడ్ కి కనుమరుగవుతున్న నటి పూజ హెగ్డే సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. గుంటూరు కారం ఛాన్స్ వదులుకుని పూజ హెగ్డే తన కెరీర్ ని తానే కాపాడుకుంది అంటూ ఆ చిత్రం చూసాక పూజ అభిమానులే కాదు.. శ్రీలీల కేరెక్టర్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు చేసిన కామెంట్ అది. మరి ఆ చిత్రం తర్వాత దర్శకనిర్మాతలు కూడా పూజ హెగ్డే ని ఆల్మోస్ట్ పట్టించుకోవడం మానేశారు.
అయినా బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటో షూట్ తో సందడి చేస్తూనే ఉంది. గ్లామర్ లుక్, ట్రెడిషనల్ లుక్ తో హడావిడి మొదలు పెట్టింది. అయితే పూజ హెగ్డే కి సౌత్ లో ఆఫర్స్ రాకపోయినా.. హిందీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వచ్చాయంటున్నారు. అవి ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ప్రస్తుతం పూజ హెగ్డే ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టడమే కాదు.. ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కి సమయం కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే సారీ లుక్ షేర్ చేసింది. పూజా హెగ్డే కొత్త పిక్స్ చూడగానే.. బ్యూటిఫుల్ గా ఉంది, మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ అంటూ ఆమె అందాన్ని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. నిజమే ఈ బ్లాక్ శారీలో పూజ అందాలని వర్ణించడం కష్టం సుమీ.