Advertisementt

శ్రీలీలని శభాష్ అనాల్సిందే..

Sun 03rd Mar 2024 02:05 PM
sreeleela  శ్రీలీలని శభాష్ అనాల్సిందే..
Sreeleela spellbound with her classical dance శ్రీలీలని శభాష్ అనాల్సిందే..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందంతోనే కాదు.. తనలోని డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లోకి మరింతగా చొచ్చుకుపోయిన శ్రీలీల.. డాన్స్ స్టెప్పులకి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు, హీరో లేడు. అందుకే ధమాకా రిలీజ్ అవ్వకుండానే శ్రీలీల చేతిలోకి ఆరేడు ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. కానీ ఇప్పుడు వరస వైఫల్యాలతో శ్రీలీల డౌన్ లో ఉండడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు కూడా మాట్లాడుకోవడం తగ్గింది.

అయితే ఒక్కసారిగా శ్రీలీల సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కారణం ఆమె డాన్స్ లో టాప్ అని తెలుసు కదా.. ఇప్పుడు భ‌ర‌త‌నాట్యాన్ని కూడా శ్రీలీల అవ‌లీల‌గా చేస్తూ కనిపించేసింది. వెస్ట్రెన్ డాన్స్ లో తోపు అయిన శ్రీలీల ఇలా భారత నాట్యం కళాకారులు ధరించే సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన శాస్త్రీయ నృత్యం చూప‌రుల‌ను క‌ట్టి పడేసింది అని చెప్పాలి. 

తన అంద‌మైన కళ్ళను చ‌క్రాల్లాంటి తిప్పుతూ.. మ్యూజిక్ కి ల‌య‌బ‌ద్ధంగా తనలోని ప్ర‌తి భాగాన్ని అద్భుత‌ భంగిమ‌లో తిప్పుతూ, పాద కదలికలతో సహా అందరి మనసులని దోచేసింది. వెస్ట్రెన్ డాన్స్ లో శ్రీలీల తో స్టెప్స్ వేయాలనుకునే హీరోలు ఇప్పుడు శ్రీలీల్ భరత నాట్యం చూసి ఏమంటారో. నెటిజెన్స్ మాత్రం శ్రీలీలలోని మరో కోణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదండోయ్ శ్రీలీలని చూస్తే ముద్దేస్తుంది అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు.. మనం కూడా శభాష్ అనాల్సిందే..

Sreeleela spellbound with her classical dance:

Sreeleela stuns with her classical dance

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ