Advertisementt

మొగలిరేకులు దయ మరణానికి కారణాలు

Sun 03rd Mar 2024 01:16 PM
mogalirekulu pavitranath  మొగలిరేకులు దయ మరణానికి కారణాలు
Mogalirekulu Pavitranath passed away మొగలిరేకులు దయ మరణానికి కారణాలు
Advertisement
Ads by CJ

మొగలి రేకులు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన దయ ఉరఫ్ పవిత్రనాథ్ అకాల మరణం బుల్లితెర ప్రేక్షకులని షాక్ కి గురి చేసింది. దయ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించిన పవిత్రనాథ్ పలు సీరియల్స్ లో నటించినా అతన్ని ఇంకా దయగానే గుర్తిస్తారు. మొగలి రేకులు సీరియల్ లో ధర్మ, సత్య, దయ పేర్లు అంతగా పాపులర్ అయ్యాయి. బుల్లితెర మీద పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ లో అనేక ఒడిడుకులు ఎదుర్కున్నాడు. 

అతని భార్య శశిరేఖ పవిత్రనాథ్ పై కేసు పెట్టడం, అతను తాగేసి వచ్చి హింసించేవాడంటూ అలిగేషన్స్ చెయ్యడంతో డిప్రెషన్ కి లోనై పవిత్రనాథ్ కెరీర్లో కూడా వెనుకపడిపోయాడు. కొద్దిరోజులుగా స్నేహితులకి, ఇండస్ట్రీ పీపుల్ కి దూరంగా ఉంటున్న పవిత్రనాథ్ సైలెంట్ గా ముభావంగా ఉంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇంత సడన్ గా పవిత్రనాథ్ మరణానికి కారణాలేమిటో అంటూ చాలామంది ఆరాలు తీసుతున్నారు. పవిత్రనాథ్ కొద్దిరోజులక్రితం అస్వస్థతకి గురి కావడంతో కుటుంభ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది.

శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది తలెత్తడంతో కుటుంభ సభ్యులు ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది అని, అప్పటికే పవిత్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో హార్ట్ ఫెయిల్యూర్ అవడంతో అతను మృతి చెందినట్లుగా వైద్యులు నిర్దారించినట్లుగా సమాచారం. అతని మరణాన్ని బుల్లితెర నటులు, ఆయన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Mogalirekulu Pavitranath passed away:

Mogalirekulu Pavitranath passed away due to health reason

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ