Advertisementt

RRR పాటకు డాన్స్ కుమ్మేసిన ఖాన్ త్రయం

Sun 03rd Mar 2024 09:56 AM
srk,salman  RRR పాటకు డాన్స్ కుమ్మేసిన ఖాన్ త్రయం
SRK, Salman, Aamir Set Stage on Fire With EPIC Naatu Naatu Dance RRR పాటకు డాన్స్ కుమ్మేసిన ఖాన్ త్రయం
Advertisement
Ads by CJ

వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్ లో ఏ రేంజ్ లో జరుగుతున్నాయో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. గత మూడు రోజులుగా ముంబై సెలబ్రిటీస్ మొత్తం గుజరాత్ లోని జామ్ నగర్ లో బస చేసారు. అక్కడ ముఖేష్ అంబానీ స్పెషల్ గా రెడీ చేయించిన గుడారాల్లో సేద తీరుతూ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకుంటున్నారు. నిన్న శనివారం సాయంత్రం జరిగిన అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ లో సెలబ్రిటీస్ డాన్స్ లతో హోరెత్తించారు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని నాచు నాచు సాంగ్ కి బాలీవుడ్ బడా ఖాన్ త్రయం డాన్స్ తో ఇరగదీసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టెప్ ను సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు చెడకొట్టినా సరదాగా ఆ పాటకి డాన్స్ చేస్తూ సందడి చేసారు. చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్ పై ముగ్గురు కనిపించడం ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయగా.. వీరు  ముగ్గురు కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది.

అంతేకాదు బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్, ఖుషి కపూర్ లతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కాలు కదపడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుర్ర హీరోయిన్స్ నలుగురు ఏంజెల్స్ లా ఆడిపాడారు.

ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. గుజరాత్ లోని జామ్ నగర్‏లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరు అవుతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఈరోజుతో ముగియనున్నాయి.

SRK, Salman, Aamir Set Stage on Fire With EPIC Naatu Naatu Dance:

SRK, Salman, Aamir Set Stage on Fire With EPIC Naatu Naatu Dance in Jamnagar, Videos Go Viral

Tags:   SRK, SALMAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ