Advertisementt

వరలక్ష్మి వధువుగా మారింది

Sat 02nd Mar 2024 07:41 PM
varalakshmi sarathkumar  వరలక్ష్మి వధువుగా మారింది
Actress Varalakshmi Sarathkumar engaged వరలక్ష్మి వధువుగా మారింది
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్, ప్రస్తుతం నటిగా దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విశాల్ తో ప్రేమాయణం నడిపిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ లవ్ బ్రేకప్ తర్వాత సింగిల్ గానే కనిపిస్తుంది. తండ్రి శరత్ కుమార్ అలాగే రాధికతో క్లోజ్ గా మూవ్ అవుతుంది.

తన సినిమాలేవో తాను చేసుకుంటుంది అనుకుంటే.. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. మార్చి 1న అంటే నిన్న శుక్రవారమే ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. శరత్ కుమార్, రాధికా, రాధికా కుమర్తె, ఇంకొద్దిమంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్యన ఈ నిశ్చితార్ధం జరిగిపోయినట్లుగా సమాచారం.. ఇక వరలక్ష్మికి కాబోయే భర్త ముంబైలో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ తో బ్రేకప్ అయ్యాక నిక్లాయ్ సచ్‌దేవ్‌ గత రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా  చెబుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో వీరు ఒక్కటవుతున్నారు అని తెలుస్తోంది. కాకపోతే వీరి వివాహం తేదీ ఇప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

Actress Varalakshmi Sarathkumar engaged:

Varalakshmi Sarathkumar gets engaged

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ