ప్రస్తుతం గుజరాత్ లోని జామ్ నగర్ మొత్తం సెలెబ్రటీస్ తో నిండిపోయింది. అక్కడ ఇండియాస్ రిచ్చెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి రాధిక మర్చెంట్ తో రేపు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కోసం ముంబైలోని బాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం గుజరాత్ లోనే మకాం వేశారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు సెలబ్రిటీస్ అక్కడికి తరలి వెళ్లారు. అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే సినిమా తారల హడావిడి లేకపోతె ఎలా.. అక్కడ జరిగే వేడుకలకు హాజరవుతున్న సినిమా సెలబ్రిటీస్ అవసరమైతే ఎంటర్టైన్ కూడా చేసేలా ఉన్నారు.
గత రాత్రి ముఖ్శేష్ అంబానీ కొడుకు సంగీత్ వేడుకల్లో పాప్ సింగర్ రెహానాతో కలిసి హీరోయిన్ జాన్వీ కపూర్ జిందగీ పాట కి వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ మోడరన్ లుక్ లో మంచి జోష్ లో వేసిన డాన్స్ స్టెప్స్ చూసిన అభిమానులు జాన్వీ కపూర్ ని తెగ పొగిడేస్తున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ అవార్డు వేడుకల్లో, అలాగే మరికొన్ని ఈవెంట్స్ లో స్పెషల్ డాన్స్ చేస్తూ అలరించినట్టుగానే ముఖేష్ ఇంట పెళ్లి వేడుకల్లో అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో చూపరులని ఆకట్టుకుంది.
టాలీవుడ్ నుంచి రామ్ చరణ్-ఉపాసనలకి అంబానీ ఇంట పెళ్లి వేడుకల కోసం ప్రత్యేక ఆహ్వానం అందగా.. వారు నిన్న సాయంత్రమే గుజరాత్లోని జామ్ నగర్ కి పయనమయ్యారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖులతో ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.