Advertisementt

భర్తకు చెక్ చెప్పిన నయనతార

Sat 02nd Mar 2024 02:38 PM
nayanthara  భర్తకు చెక్ చెప్పిన నయనతార
Nayanthara Unfollows Vignesh Shivan On Instagram భర్తకు చెక్ చెప్పిన నయనతార
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన రేంజ్ ఎప్పటికప్పుడు చూపిస్తున్న నయనతార 2022 జూన్ లో దర్శకుడు విగ్నేష్ శివన్ ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి సరోగసి ద్వారా ట్విన్స్ పుట్టారు. పిల్లలతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్న నయనతార-విగ్నేష్ శివన్ లు ఎప్పటికప్పుడు తమ హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే నయనతార రీసెంట్ గానే తన కొడుకులతో కలిసి ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నయనతార ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ తో పాటుగా భర్త విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేసింది. నయనతార సోషల్ మీడియాలో కన్నీళ్లతో కూడా ఇది నాకు లభించిందని ఎప్పటికీ చెబుతుంది అన్నట్టుగా ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ షేర్ చేసింది. అలాగే ఆమె తన ఇన్ స్టాలో భర్త విఘ్నేశ్ శివన్‍ను అన్ ఫాలో చేసి అందరికి షాకిచ్చింది.

అంతేకాకుండా పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయనతార ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏంటి ప్రేమ పక్షుల్లా ఉండే నయన్-విగ్నేష్ లు విడిపోతున్నారా?  లేదంటే నయన్ అలా భర్తని అన్ ఫాలో చెయ్యడమేమిటి? కాదు పొరపాటున ఏమైనా జరిగి ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Nayanthara Unfollows Vignesh Shivan On Instagram :

Nayanthara Unfollows Vignesh Shivan On Instagram Cryptic Post Creates Buzz

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ