దర్శకుడు క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని దీని నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాడిసన్ హోటల్ పై పోలీస్ దాడి జరగ్గానే క్రిష్ ముంబై వెళ్ళిపోయి అక్కడే వుండి విచారణకు రాకుండా బెయిల్ తెచ్చుకోవాలని చూస్తున్నాడంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. క్రిష్ కూడా తాను ఆ పార్టీకి హాజరవలేదు అంటూనే బెయిల్ కోసం ట్రై చెయ్యడం పలు అనుమానాలకు దారితీసింది.
పోలీసులు మాత్రం క్రిష్ ని A10 నిందితుడిగా చేర్చి FIR నమోదు చేసి విచారణకు పిలిచారు. అంతేకాకుండా క్రిష్ నుంచి రక్తం, యూరిన్ సేకరించి పరీక్షకి పంపాలనుకున్నారు. అటు వివేక్, నిర్భయ్, కేతరనాధ్, సయ్యద్ రక్తనమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు బయటపడడంతో క్రిష్ విషయంలో ఏం జరుగుతుందో అని అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు. క్రిష్ మాత్రం బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అప్లై చెయ్యగా.. ఆ కేసు సోమవారం కి వాయిదా పడడంతో క్రిష్ నిన్న శుక్రవారం సైలెంట్ గా పోలీసులు ఎదుట విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది.
క్రిష్ ని పోలీసులు కొద్దిసేపు విచారణ చేసిన పిదప ఆయన రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షకి పంపి క్రిష్ ని పంపించేసినట్టుగా తెలుస్తోంది. మరి డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ కేసు ఇంకే మలుపులు తీసుకుంటుందో చూడాలి.