Advertisementt

ఎన్టీఆర్-చరణ్ స్ట్రాంగ్ బాండింగ్ !

Sat 02nd Mar 2024 10:18 AM
ram charan  ఎన్టీఆర్-చరణ్ స్ట్రాంగ్ బాండింగ్ !
Ram Charan and NTR spotted at airport ఎన్టీఆర్-చరణ్ స్ట్రాంగ్ బాండింగ్ !
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇద్దరూ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో నటించి గ్లోబల్ స్టార్స్ గా ఒకేసారి ఆ స్టేటస్ ని అందుకున్నారు. ఆ చిత్రంలో వాళ్ళు రామరాజు, భీమ్ గా ప్రేక్షకుల మనసులని దోచేస్తే అభిమానులకి సూపర్ కిక్ ఇచ్చారు. అసలు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ దోస్తీకి మురిసిపోని తెలుగు ప్రేక్షకులు లేరు. వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ కి అందరూ ఫిదా అయ్యారు.

ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా అందరూ అద్భుతంగా ఫీలవుతున్నారు. తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ముంబై వెళ్ళాడు. నిన్న సాయంత్రం చరణ్-ఉపాసన స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లివేడుకల్లో పాల్గొనడానికి వారు ముంబై వెళ్లగా.. ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి లు తమ ఫ్యామిలీ ఈవెంట్ కోసం బెంగుళూరుకి బయలు దేరారు. ఎన్టీఆర్, ప్రణతి కూడా నిన్న సాయంత్రమే బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.

అయితే ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించారు. రామ్ చరణ్ ఆప్యాయంగా ఎన్టీఆర్ మీద చెయ్యి వేసి లోపలి తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, వాళ్ళ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు కానీ వేరే హీరోల అభిమానులు మాత్రం వీళ్లిద్దరి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ వార్స్ చేసుకోకుండా ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan and NTR spotted at airport:

Ram Charan and NTR spotted at Hyderabad airport

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ