Advertisement
TDP Ads

బీజేపీతో ఇక యుద్ధమే..!

Fri 01st Mar 2024 05:02 PM
bjp  బీజేపీతో ఇక యుద్ధమే..!
It is a war with BJP..! బీజేపీతో ఇక యుద్ధమే..!
Advertisement

బీజేపీతో పొత్తుపై రానున్న క్లారిటీ.. ఇక యుద్ధమే..!

రోజులు గడుస్తున్నాయి.. మరో పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అయినా సరే.. ఏపీలో పొత్తులు ఇంకా తేలలేదు. టీడీపీ, జనసేనలు పొత్తుతూనే ముందుకు వెళుతున్నాయి. వచ్చిన చిక్కల్లా బీజేపీతోనే. ఏదీ తేల్చదు.. ముందుకు వెళ్లనివ్వదు. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ అధినాయకత్వంతో పొత్తులపై చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందని వార్తలైతే వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటనే రావడం లేదు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందో.. ఎందుకు బీజేపీ ఈ విషయంలో తాత్సారం చేస్తోందో అంతుబట్టడం లేదు.

బీజేపీ కోసం సీట్ల త్యాగం..

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. వీరిద్దరూ అయితే ఈసారి తాడో పేడో తేల్చుకునే ఏపీకి తిరిగి వస్తారట. టీడీపీ, జనసేనల తొలి జాబితా విడుదల నేపథ్యంలో పవన్ అయితే బీజేపీ కోసం కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందనైతే చెప్పారు. బీజేపీ కూడా వచ్చి తమతో చేరుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రబాబు హస్తినకు వెళ్లి పొత్తుపై బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ విషయంలో బీజేపీ కూడా సుముఖంగానే ఉంది. ఇక ఈ రెండు రోజుల భేటీలు పూర్తైతే సీట్లతో సహా అన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మార్చి 3న పొత్తుకు సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. దీంతో ఇక టీడీపీ యుద్ధం ప్రారంభించనుంది.

రసవత్తరంగా మారనున్న ఎన్నికల పోరు..

ఇప్పటి వరకైతే పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలు బీజేపీకి 33 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు వదిలినట్టు టాక్ నడుస్తోంది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు.. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. పొత్తు ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనల మలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత బీజేపీ కూడా జాబితాను విడుదల చేయనుంది. మొత్తానికి మార్చి రెండో వారం నాటికి ఈ మూడు పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసి ఆ వెంటనే ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. ఈ సారి ఏపీలో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలో తలపడి ఎలాగైనా గెలవాలని వైసీపీ చూస్తోంది. కానీ పరిణామాలేవీ అనుకూలంగా లేవు. ఒక చెల్లి రోజుకో రీతిన విమర్శిస్తుంటే.. బాబాయి కూతురు వచ్చేసి హత్యా రాజకీయాలు చేసే అన్నను ఓడించాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో పరిణామాలన్నీ జగన్‌కు ఎలా ఫేవర్‌గా మారాయో.. ఇప్పుడు అవే పరిణామాలు రివర్స్ అయ్యాయి.

It is a war with BJP..!:

Clarity coming on alliance with BJP.. Now it's a war

Tags:   BJP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement