Advertisementt

షణ్ముఖ్ లైఫ్ అలా అవుతుందనుకోలేదు: సిరి

Thu 29th Feb 2024 07:37 PM
siri  షణ్ముఖ్ లైఫ్ అలా అవుతుందనుకోలేదు: సిరి
Siri about Shanmukh personal life షణ్ముఖ్ లైఫ్ అలా అవుతుందనుకోలేదు: సిరి
Advertisement
Ads by CJ

షణ్ముఖ్ యూట్యూబర్ గా ఎంతమంది అభిమానులని సంపాదించుకున్నాడో, యూట్యూబ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో పర్సనల్ లైఫ్ లోను షణ్ముఖ్ చుట్టూ అదేమాదిరి వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో కార్ యాక్సిడెంట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. బిగ్ బాస్ తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పడం అంతే సంచలనం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కేరీర్లో బిజీ అవుతున్నాడనుకున్న సమయంలో షణ్ముఖ్ డిప్రెషన్ కి లోనై గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడనే వార్త మరింత హాట్ టాపిక్ అయ్యింది.

రీసెంట్ గానే గంజాయి కేసులో షణ్ముఖ్ జైలుకి వెళ్ళొచ్చాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరితో చేసిన స్నేహం షణ్ముఖ్ ని విపరీతంగా ట్రోల్ చేసింది. సిరి ఫ్రెండ్ షిప్ వలనే అతని గర్ల్ ఫ్రెండ్ అతనికి బ్రేకప్ చెప్పింది. అటు సిరి కూడా నెటిజెన్స్ నుంచి ట్రోల్ కి గురయ్యింది. తాజాగా సిరి ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించగా ఓ యూట్యూబ్ యాంకర్ సిరి మీరు బిగ్ బాస్ నుంచి వచ్చాక మళ్ళీ షణ్ముఖ్ ని కలిసారా అని అడిగితే.. లేదు కలవలేదు, నేను హౌస్ నుంచి బయటికొచ్చాక నా మీద ట్రోల్స్ చూసి చాలా ఫీలయ్యాను. నాకు తెలియదు కదా బయట జరుగుతున్న విషయాలు.

హౌస్ నుంచి బయటికొచ్చాక దాని గుగురించి ఆలోచించలేదు, ట్రోల్స్ చూసి బాధపడిన తర్వాత ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యాం. షణ్ముఖ్ ని కలవలేదు. షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ లో అలా జరుగుతుంది అనుకోలేదు, బ్రేకప్ అవుతుంది అనుకోలేదు. విడిపోతారని తెలియదు. షణ్ముఖ్ గురించి తర్వాత నాకేమి తెలియదు అంటూ సిరి సమాధానమిచ్చింది. మళ్ళీ జెస్సి ని, షన్ను ని కలుస్తారా అని అడిగితే.. లేదు అంటూ మొహం మీదే చెప్పేసింది. 

అయితే మొన్నామధ్యన షణ్ముఖ్ లాయర్ షణ్ముఖ్ ని బిగ్ బాస్ లో వాడుకుని సిరి కెరీర్ లో సెటిల్ అయ్యింది, కానీ షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ లో డిస్టబెన్స్ వలన డిప్రెషన్ కి లోనయ్యాడు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. 

Siri about Shanmukh personal life:

Shanmukh personal life didn't want to be like that: Siri

Tags:   SIRI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ