Advertisementt

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ

Thu 29th Feb 2024 10:18 AM
mudragada padmanabham  పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ
Mudragada Padmanabham letter to Pawan Kalyan పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ
Advertisement
Ads by CJ

పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ మరో లేఖాస్త్రం సంధించారు. కొద్దిరోజులుగా జనసేనలో ముద్రగడ పద్మనాభం జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది. పవన్ కల్యాణ్ వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించక పోవడంతో ముద్రగడ బాగా హర్ట్ అయినట్టు అనిపిస్తుంది. చాలారోజులుగా విమర్శలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరోసారి విమర్శలు అందుకున్నారు. 

ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారనగానే జనసేన నేతలు ముద్రగడ ఇంటికి క్యూ కట్టారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం ని కలుస్తారని చెప్పుకుంటూ వచ్చారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ని తన దగ్గరకి వస్తారు, జనసేన పార్టీలో చేరుదామనుకుని వెయిట్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఆయన్ని కలవకుండా షాకిస్తూనే ఉన్నారు. గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ రాక కోసం వెయిట్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఈరోజు పవన్ కి పదునైన మాటలతో ఘాటుగా లేఖ సంధించారు.

మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు

2019 ఎన్నికల ముందు కవాతు సందర్భముగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు.

అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నావంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి.

మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి, వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి, కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి.

గౌరవ చంద్రబాబునాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టి.డి.పి కేడరు బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి బరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విఫరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారండి. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి, ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి.

40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుడ్ని ఆపరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి. కాని మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల ఫర్మిషన్లు

తీసుకోవాలండి. మీ పార్టీ పోటీచేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి.

ఆల్ ది బెస్ట్. ముద్రగడ పద్మనాభం

ముద్రగడ పద్మనాభం 

Mudragada Padmanabham letter to Pawan Kalyan:

Mudragada Padmanabham

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ