టాలీవుడ్ లో స్టార్ అవకాశాలు రాక, లేక ప్రస్తుతం హిందీలో అవకాశాలు వెతుక్కొంటూ మెల్లగా అక్కడ సెటిల్ అయ్యే ఏర్పాట్లలో ఉన్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఇప్పుడు చిక్కిపోయి చక్కనమ్మగా మారిపోయింది. స్లిమ్ గా కనిపించడమే కాదు.. ముంబై వీధుల్లో యోధా ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి రాశి ఖన్నా యోధా ప్రమోషన్స్ అంటూ హల్చల్ చెయ్యడమే కాదు.. మోడ్రెన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూ కవ్విస్తుంది.
సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని హంగామా చేస్తున్న రాశి ఖన్నా ఇప్పుడు హైదరాబాద్ లో వాలిపోయింది. యోధా ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా హైదరాబాద్ కి రాగానే కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశి ఖన్నా ఈ లుక్ లో చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా బ్యూటిఫుల్ గా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, హెయిర్ ముడి కట్టి.. డ్రెస్ కి తగ్గట్టుగా జ్యువెలరీ ధరించి ట్రెండీ లుక్ లో కనిపించింది.
షాహిద్ కపూర్ తో కలిసి ఫార్జి వెబ్ సిరీస్ తర్వాత రాశి ఖన్నా యోధా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి ఈ చిత్రం హిట్ అయితే రాశి ఖన్నా ముంబై లో సెటిల్ అవుతుంది. ఇకపై సౌత్ లో కనిపించకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.