రష్మిక మందన్న పేరు సౌత్ నుంచి నార్త్ వరకు మార్మోగిపోతుంది. నేషనల్ క్రష్ గా రశ్మిక మందన్న యూత్ మనసుని ఎప్పుడో దోచేసింది. సౌత్ లో రారాణిగా వెలిగినా.. నార్త్ లో హిట్ కోసం తహతహలాడింది. అది యానిమల్ తో సంపూర్ణమయ్యింది. రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ చిత్రంతో రష్మిక మందన్న తిరుగులేని హిట్ కొట్టింది. దానితో రష్మిక హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి ఎక్కేసింది. అయితే సౌత్ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక డేటింగ్ లో ఉంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా ఈ జంట ఆ విషయమై ఎప్పటికప్పుడు తాము ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తుంది.
కానీ ఈ రూమర్స్ కి అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. తాజాగా రష్మిక అభిమానులు ఓ ఫ్యాన్ పేజీ లో రశ్మికకి భర్త కావాలంటే ఎలాంటి లక్షణాలుండాలో తెలుసా అనే ప్రశ్న వేశారు. అంతేకాదు దానికి సమాధానమిచ్చారు. రశ్మికకి VD లాంటి భర్త దొరకాలి.. అంటే వెరీ డేరింగ్ గా ఉండాలి అని రిప్లై ఇచ్చారు. రశ్మికని మేము క్వీన్ అంటాం, ఆమె భర్తని కింగ్ అని పిలుస్తాము అంటూ ఆ పేజీ లో రాసుకొచ్చారు. దానికి రష్మిక కూడా అవును నిజమే అంటూ స్పందించడంతో VD అంటే విజయ్ దేవరకొండ లాంటి భర్త తనకి కావాలేమో, అందుకే అవును ఇది నిజమే అంటూ రియాక్ట్ అయ్యింది అని మాట్లాడుకుంటున్నారు.
మరి మొన్న శుక్రవారం జరిగిన ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ హాజరయ్యారు. విడివిడిగానే అనుకోండి అయినా.. మీడియా మాత్రం ఇద్దరిని వదలకుండా ఫోటోలు క్లిక్ మనిపించారు.