యాంకర్ అనసూయ కాస్తా నటి అనసూయ గా మారిన తర్వాత ఆమె జోష్ సోషల్ మీడియాలో తగ్గుతుంది.. ఇకపై గుంభనంగా సినిమాలు చేసుకుంటుంది అనుకుంటే.. అనసూయ మాత్రం వెండితెర మీద ఎంత బిజీగా వున్నా సోషల్ మీడియాని వదిలేదెలే అంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేసే అనసూయ తన ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫొటోస్ ని కూడా షేర్ చేస్తుంది. భర్తతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్, జిమ్ కి వెళ్లొచ్చే ఫొటోస్ ని షేర్ చేస్తూ ఎప్పుడూ సందడిగానే కనిపిస్తుంది.
రీసెంట్ గా దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మెరిసింది. బ్లాక్ కలర్ మోడ్రెన్ సారీ లో గ్లామర్ గా కనిపించింది.
పిల్లలతో కలిసి ఆడుకుంటూ, స్విమ్ చేస్తూ, ఫెస్టివల్స్ కి సందడి చేసే ఫోటొస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ మార్నింగ్ జోష్ ఫొటోస్ ని షేర్ చేసింది. భర్త భరద్వాజ్ తో కలిసి అనసూయ ఉదయపు ఎండని ఎంజాయ్ చేస్తుంది. అనసూయ షేర్ చేసిన పిక్స్ తో పాటుగా Say Hi to puffy morning faces 🥱😮💨😁అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం అనసూయ ఆమె భర్త భరద్వాజ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.