దర్శకుడు క్రిష్ పరారీలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు క్రిష్ రియాక్ట్ అయ్యారు. తానెక్కడికి పారిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. క్రిష్ పారిపోవడమేమిటి, అసలు క్రిష్ పై ఈ రూమర్ ఎలా పుట్టింది అంటే.. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఒక రాజకీయనాయకుడు కొడుకు అలాగే ఇద్దరు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం కలకలం రేపింది. ఈ డ్రగ్స్ కేసులో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పేర్లు బయటికి వచ్చాయి.
అందులో ముఖ్యంగా మోడల్ లిపి గణేష్ పేరు హైలెట్ అవగా.. దర్శకుడు క్రిష్ కూడా రాడిసన్ హోటల్ కి వెళ్లాడనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ పరారీలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో వెంటనే క్రిష్ రియాక్ట్ అయ్యారు. క్రిష్ మట్లాడుతూ తాను ఆ రోజు గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ కి వెళ్లడం నిజమే, అయితే తాను ఓ స్నేహితుడిని కలవడానికి రాడిసన్ హోటల్ కి వెళ్ళాను, సాయంత్రం వెళ్లిన నేను ఓ అరగంట మాత్రమే అక్కడ ఉన్నాను. నా ఫ్రెండ్ వివేకానంద తో మాట్లాడి వెంటనే వచ్చేసాను.
ఇప్పటికే నేను పోలీసులకి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నేను 6.45 నిమిషాలకి హోటల్ నుంచి బయటికొచ్చిన వివరాలని పోలీసులకి అందించాను. అంతేకాని నాకు ఈకేసుతో ఎలాంటి సంబంధం లేదు అంటూ క్రిష్ వివరణ ఇచ్చారు. అయితే అక్కడ రాడిసన్ హోటల్ లో వివేకానంద ఇచ్చిన పార్టీకి పలువురు ప్రముఖులు హాజరవగా అందులో క్రిష్ పేరు తెరపైకి రావడమే హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆ వార్తలని క్రిష్ ఖండించారు.