Advertisementt

గేమ్ ఛేంజర్ కోసం వెయిట్ చెయ్యక్కర్లా..

Tue 27th Feb 2024 10:44 AM
game changer  గేమ్ ఛేంజర్ కోసం వెయిట్ చెయ్యక్కర్లా..
Wait for the Game Changer.. గేమ్ ఛేంజర్ కోసం వెయిట్ చెయ్యక్కర్లా..
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం మినీ యుద్ధమే చేసారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు శంకర్, దిల్ రాజులకి ఆల్మోస్ట్ చుక్కలు చూపించినంత పని చేసారు. అయినప్పటికీ శంకర్-దిల్ రాజులు తొందరపడిపోకుండా సైలెన్స్ ని మైంటైన్ చేసారు. గేమ్ ఛేంజర్ పాట ఇస్తామని చెప్పి నాలుగు నెలలు సమయం గడిచిపోయింది. కానీ అది కూడా ఇవ్వకపోయేసరికి మెగా అభిమానులకి చిర్రెత్తుకొచ్చింది. గేమ్ ఛేంజర్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూడని రోజు లేదు.

ఇకపై మెగా ఫాన్స్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ సిద్దమైపోతున్నాయి. మరొక్క నెల ఓపికపట్టండి. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ సిద్ధం చేస్తున్నారు. అదే రోజు గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటుగా.. ఓ చిన్నపాటి గ్లిమ్ప్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. సో మెగా అభిమానులు ఇక వెయిట్ చెయ్యక్కర్లేదు.. సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ ని ట్రెండ్ చెయ్యడానికి రెడీ అయిపోండి.

ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం దసరా స్పెషల్ గా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Wait for the Game Changer..:

Game Changer movie update 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ