మెహ్రీన్ కౌర్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా వినిపించడం లేదు. ఎఫ్ 3 తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ప్రెజెంట్ మెహ్రీన్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ కూడా లేదు. ఆమెకి వరసగా ప్లాప్ లు రావడంతో ఛాన్స్ లు ఇచ్చే దర్శకనిర్మాతలు కూడా కరువయ్యారు. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న మెహ్రీన్ ఇకపై డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మెరుస్తుంది అనుకున్నారు. అదేమో కానీ మెహ్రీన్ తాజాగా తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది. గత వారం రోజులుగా మెహ్రీన్ కౌర్ గోవాలోనే కనిపించింది. తరచూ గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరి నిన్నటివరకు గోవాలో సందడి చేసిన మెహ్రీన్ కౌర్ ఇప్పుడు దుబాయ్ లో తేలింది. తాను దుబాయ్ లో ఉన్నట్లుగా మెహ్రీన్ కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో రెడ్ ఫ్రాక్ లో చాలా అందంగా కనిపించింది. రెడ్ ఫ్రాక్ లో గులాబీలా మెరిసిపోయింది. మరి గోవా తర్వాత వేంటనే మెహ్రీన్ దుబాయ్ కి ఎందుకెళ్ళిందా అని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు.
గోవా వెకేషన్ తర్వాత మెహ్రీన్ దుబాయ్ వెకేషన్ వేసిందేమో అంటూ సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. గోవా- దుబాయ్ అంటున్నావ్.. ఏంటి కథ మెహ్రీన్ అంటూ ఆటపట్టిస్తున్నారు.