Advertisementt

దేవర సెట్స్ లోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్

Mon 26th Feb 2024 08:28 PM
saif ali khan  దేవర సెట్స్ లోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్
Saif Ali Khan is coming to the sets of Devara దేవర సెట్స్ లోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ దేవర చిత్రంలో విలన్ కేరెక్టర్ లో కనిపించబోతున్న సైఫ్ అలీ ఖాన్ నెల రోజుల క్రితం దేవర సెట్స్ లో గాయపడి ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే. ఆయన డిస్చార్జ్ అయ్యే ముందు చేతికి బ్యాండేజ్ తో బయటికి వచ్చారు. దానితో దేవర చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది. సైఫ్ అలీ ఖాన్ కి దెబ్బతగలడం వల్లనే కాదు, ఇంకా షూటింగ్ ఓ కొలిక్కి రాకపోవడంతో దేవర చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది. అదేదో ఆగష్టు కి చేస్తారు అనుకుంటే.. ఏకంగా అక్టోబర్ లోకి తీసుకెళ్లిపోయారు. సైఫ్ లేకపోయినా కొరటాల సైఫ్ లేని కొన్ని సన్నీవేశాల చిత్రీకరణ చేపట్టారన్నారు.

ఇక నేడు రామోజీ ఫిలిం సిటీలో దేవర యాక్షన్ ఎపిసోడ్ ఒకటి మొదలైనట్టుగా అప్ డేట్ వినిపించింది. ఇక కైఫ్ అలీఖాన్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నారని, మార్చి రెండో వారంలో సైఫ్ అలీ ఖాన్ దేవర షూటింగ్‌కు హాజరవుతాడని తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సైఫ్-ఎన్టీఆర్ కలయికలో కాంబినేషన్లో మేజర్ సీక్వెన్సులు తీయడానికి టీం షెడ్యూళ్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మే కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు, అలాగే పబ్లిసిటీ ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారట.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి పార్ట్ 1 తో పాటుగా దేవర పార్ట్ 2 కి సంబంధించి కూడా కొరటాల ఆల్రెడీ కొంత షూట్ చేసినట్లుగా వినికిడి. 

Saif Ali Khan is coming to the sets of Devara:

Saif Ali Khan Tricep Injury on the Sets of Devara

Tags:   SAIF ALI KHAN