నాలుగు పదులు వయసు దాటుతున్నా పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేస్తున్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తరచూ ఇటలీకి వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. అక్కడే ఇటలీలో ప్రభాస్ ప్రాపర్టీస్ కొంటున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ప్రభాస్ లండన్ వెళ్ళినప్పుడు ఉండేందుకు అనుకూలంగా లండన్ లో ఓ ఇల్లుని తీసుకుంటున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లండన్ లో ఇల్లు కొనకుండా ఓ లగ్జరీ హౌస్ ని జస్ట్ అద్దెకు తీసుకుని వెకేషన్స్ కి వెళ్ళినప్పడు ఎంజాయ్ చెయ్యాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట.
నెలకి దాదాపుగా 60 లక్షలు అద్దె చెల్లించి మరీ ప్రభాస్ లండన్ లో లగ్జరీ హౌస్ ని అద్దెకి తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు, వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రభాస్ లండన్ వెళ్లి ఉండేందుకే ఇలా ఇల్లు అద్దెకి తీసుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ లండన్ లోనే ఉన్నారట. లండన్ నుంచి తిరిగివచ్చాక ప్రభాస్ ప్రాజెక్ట్ కే కల్కి షూటింగ్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. మరి హైదరాబాద్ ముంబై అంటూ తిరిగే ప్రభాస్ ఇకపై ఎక్కువగా మనకు లండన్ లోనే కనిపిస్తారేమో అని ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.