Advertisementt

బిగ్ బాస్ దివి బ్రేకప్ స్టోరీ

Mon 26th Feb 2024 09:21 AM
divi vadthya  బిగ్ బాస్ దివి బ్రేకప్ స్టోరీ
Bigg Boss Divi Breakup Story బిగ్ బాస్ దివి బ్రేకప్ స్టోరీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి వెళ్ళకముందు సినిమాల్లో హీరోయిన్స్ కి ఫ్రెండ్ కేరెక్టర్స్ చేసిన దివి.. బిగ్ బాస్ కి వెళ్ళాక మెగాస్టార్ పుణ్యమా అని ఆయన సినిమాల్లో కాస్త పేరున్న పాత్రల్లో నటించే ఛాన్స్ దొరికింది. చిరు నటించిన గాడ్ ఫాదర్ ఇంకా కొన్ని చిత్రాల్లో కనిపించింది. వాటితో పాటుగా దివి స్పెషల్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఉనికిని చాటుకుంటుంది. అటు డాన్స్ షోస్ లోను కనిపిస్తుంది. అయితే సిల్వర్ స్క్రీన్ మీద వెలిగిపోదామనుకుంటే.. అది మాత్రం ఆమెకి పెద్దగా వర్కౌట్ అయినట్లుగా కనిపించడం లేదు.

తాజాగా దివి తన బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. బిటెక్ చదివే రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించాను, ఎంటెక్ చదివేవరకు ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం. పెద్దలని ఒప్పించి పెళ్ళికి ముహుర్తాలు పెట్టుకున్నాం. అన్నీ సక్రమంగా జరుగుతున్న సమయంలోనే నా బాయ్ ఫ్రెండ్ తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. అతడు చనిపోయే చివరి క్షణాల్లో నేను నా బాయ్ ఫ్రెండ్ కి తోడుగానే ఉన్నాను. చనిపోయాక కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేవరకు అతనికి తోడుగానే ఉన్నాను.

తమ్ముడు చనిపోయాక అతను తన తల్లితండ్రుల దగ్గరే ఉంటాను అని అక్కడే ఊరిలోనే ఉండిపోయాడు. హైదరాబాద్ కి రానన్నాడు. నా ప్రొఫెషన్ దృష్ట్యా నన్ను అతను ఊరికి తీసుకెళ్లలేదు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరం విడిపోయాము.. అంటూ బ్రేకప్ స్టోరీని షేర్ చేస్తూ దివి ఎమోషనల్ అయ్యింది. 

Bigg Boss Divi Breakup Story:

Bigg Boss Fame Divi Vadthya Love Story And Breakup

Tags:   DIVI VADTHYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ