Advertisementt

రూమర్స్ కి చెక్ పెట్టిన కల్కి మేకర్స్

Sat 24th Feb 2024 12:33 PM
kalki 2898 ad  రూమర్స్ కి చెక్ పెట్టిన కల్కి మేకర్స్
Kalki makers put a check on the rumours రూమర్స్ కి చెక్ పెట్టిన కల్కి మేకర్స్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కల్కి మే 9 నుంచి కూడా మరోసారి పోస్ట్ పోన్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు షూటింగ్ కూడా పూర్తి కాలేదు, ఇంకెప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెడతారు, రిలీజ్ కి సమయం దగ్గరకొచ్చేసింది, ఇంకా పబ్లిసిటీ వగైరా ఉన్నాయి, అసలే హాలీవుడ్ రేంజ్ రిలీజ్ అంటూ ఏదేదో మాట్లాడారు. ఈ విషయంలో మేకర్స్ కూడా మౌనంగా ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళన పడ్డారు.

కానీ నిన్న శుక్రవారం కల్కి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ వదలడంతో ప్రభాస్ ఫాన్స్ రిలాక్స్ మోడ్ లోకి వెళుతున్నారు. ఆ అప్ డేట్ కల్కి కి సంబంధించి చిన్న గ్లిమ్ప్స్. అందులో బ్లాక్ షూస్ తో తా టక్కరా టక్క టక్కరా బీట్ కు ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిన్న గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాస్ బీట్ సాంగ్ కు ప్రభాస్ తన డ్యాన్స్ తో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ డాన్స్ చూడలేమేమో అని అభిమానులు ఫీలయ్యారు. కానీ ఇప్పుడొచ్చిన సూపర్ అప్ డేట్ తో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే కల్కి మేకర్స్ కల్కి మే 9 రిలీజ్ అంటూ గ్లిమ్ప్స్ తోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కల్కి పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెట్టారు.

Kalki makers put a check on the rumours:

Kalki 2898 AD: Prabhas for Ta Takkara Takka Takkara

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ