జబర్దస్త్ లోనే కాదు వెండితెరపైనే, బుల్లితెర షోస్ లోను గ్లామర్ కి కేరాఫ్ గా కనిపించే యాంకర్ రష్మీ.. 40 వ బడిలోకి అడుగుపెడుతున్నా ఆమె పెళ్లి పేరు మాత్రం ఎత్తకుండా ఇంకా సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేస్తుంది. కమెడియన్ కమ్ హీరో సుధీర్ తో రష్మీ ఆన్ స్క్రీన్ ప్రేమ ఆఫ్ స్క్రీన్ లోను వర్కౌట్ అవ్వుద్ది అని ఆమె అభిమానులు అనుకున్నా అది కుదరదని తేల్చేసింది. వెండితెర పై హీరోయిన్ గా మెరుస్తుంది అనుకుంటే సిల్వర్ స్క్రీన్ ఎప్పటికప్పుడు రష్మికి షాకిస్తూనే ఉంది.
ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తున్న రష్మీ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ కి బుల్లితెర మీద సందడి చేస్తూ.. శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకరింగ్ చేసుకుంటుంది. ఇక అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్లి ఫొటోస్ షేర్ చేసే రష్మీ తాజాగా బుట్టబొమ్మ మాదిరిగా మోడ్రెన్ ఫ్రాక్ వేసుకుని బ్యూటీఫుల్ గా కనిపించింది. ఆ డ్రెస్సులో రష్మిని చూడగానే బుట్టబొమ్మలా మారిన యాంకర్ రష్మీ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.