Advertisementt

ఈగల్ ఓటిటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్

Fri 23rd Feb 2024 06:01 PM
ravi teja  ఈగల్ ఓటిటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్
Ravi Teja Eagle OTT details ఈగల్ ఓటిటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా రవితేజకి సక్సెస్ అనేది అందని పండులా తయారైంది. వరస డిజాస్టర్స్ తో ఆయన మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. ఈమధ్యన రవితేజ తో సినిమా అనౌన్స్ చేసిన బడా నిర్మాణ సంస్థ ఆ సినిమాలో రవితేజని హీరోగా తప్పించి వేరే హీరోని వెతుక్కుంటున్నారు. గత ఏడాది టైగర్ నాగేశ్వరావు మూవీ తర్వాత ఎన్నో అంచనాలు మధ్యన వచ్చిన ఈగల్ కూడా రవితేజని డిస్పాయింట్ చేసింది. మిక్స్డ్ రివ్యూస్, భారీ ప్రమోషన్స్ కూడా ఈగల్ ని గట్టెక్కించలేకపోయాయి. అదలా ఉంటే ఇప్పుడు ఈగల్ చిత్రానికి ఓటిటీ కష్టాలంటూ సోషల్ మీడియా లో ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

ఫిబ్రవరి 9 న విడుదలైన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అనుకుంటుంటే.. ఇప్పుడు సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ ఇంకా పూర్తి కాలేదని, రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కి ముందు డిజిటల్ హక్కుల విక్రయం జరగలేదు అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఈలెక్కన ఈగల్ ఓటిటీ హక్కులు ఏ ఓటిటీ సంస్థ తీసుకుంటుందో.. ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందో అనేది అందరిలో అనుమానాలు మొలకెత్తాయి.

ఈలోపు ఈగల్ మేకర్స్ ఓటిటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అలాగే ఈగల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చేసాయి. ఈగల్ డిజిటల్ హక్కులని ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న ఈటీవి విన్ దక్కించుకున్నట్లుగా ప్రకటించారు. ఫ్యాన్సీ డీల్ తో ఈటీవి విన్ ఈగల్ డిజిటల్ హక్కులు దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈటీవి ఎపుడు స్ట్రీమింగ్ చేస్తుందో అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఉన్నారు.

Ravi Teja Eagle OTT details:

Ravi Teja Eagle OTT date locked?

Tags:   RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ