Advertisementt

అదిరిపోయిన రకుల్ పెళ్లి వీడియో

Fri 23rd Feb 2024 03:04 PM
rakul preet singh  అదిరిపోయిన రకుల్ పెళ్లి వీడియో
Rakul preet wedding video goes viral అదిరిపోయిన రకుల్ పెళ్లి వీడియో
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రేమికుడు జాకీ భగ్నానీ ని గోవా లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. రకుల్-జాకీ భగ్నానీల వివాహానికి చాలామంది బాలీవుడ్ సెలెబ్రటీస్ హాజయ్యారు. రకుల్ అండ్ జాకీ భగ్నానీలు క్రీమ్ కలర్ డిజైనర్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రెండు రోజుల తర్వాత ఈరోజు శుక్రవారం తన పెళ్లి వీడియో ని రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ వీడియోలో రకుల్ ప్రీత పెళ్లి కూతురు అలంకరణలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైన రకుల్ అందంగా నడుస్తూ డాన్స్ చేసుకుంటూ బంధువులు, స్నేహితులు మధ్య నుంచి జాకీ దగ్గరకి వచ్చింది. రకుల్ పేరెంట్స్, జాకీ భగ్నానీ పేరెంట్స్ పెళ్లి మండపంలో అటు ఇటు ఆసీనులవగా.. జాకీ భగ్నానీ మెడలో పూలమాల వేసింది రకుల్, రకుల్ మెడలో జాకీ పూల దండ వేసే సమయంలో రకుల్ జాకీని చాలా ఏడిపించేసింది. ఈ జంట వేదమంత్రారాల నడుమ ఎడడుగుల బంధంతో ఒక్కటయ్యింది.

ఇదే వీడియో క్లిప్ లో రకుల్-జాకీల హల్దీ ఫంక్షన్, అలాగే మెహిందీ సెర్మోని, ఇంకా సంగీత్ క్లిప్స్ ని కూడా జత చేసారు. ప్రతి వీడియోలో రకుల్ సంతోషంతో మెరిసిపోతూ కనిపించింది. ఇక పెళ్లి వేడుకలు పూర్తవడంతో రకుల్ జంట గోవా నుంచి తిరిగి ముంబైలో అడుగుపెట్టింది. 

Rakul preet wedding video goes viral:

 Rakul Preet Singh Bridal Entry Video Goes Viral

Tags:   RAKUL PREET SINGH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ