ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అతని సోదరుడు నిన్న గురువారం ఓ అమ్మాయిని చీటింగ్ చేసిన కేసుతో పాటుగా గంజాయి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై బిగ్ బాస్ ఫేమ్, మరో యూట్యూబర్ గీతూ రాయల్ స్పందించింది. నేను షణ్ముఖ్ బాగా మాట్లాడుకునేవాళ్ళం. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్ళాక అతనిపై నేనిచ్చిన రివ్యూస్ వలన అతని ఫ్యామిలీకి నాకు మధ్యన బాగా గ్యాప్ వచ్చేసింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ గర్ల్ ఫ్రెండ్ మౌనిక నాకు మంచి ఫ్రెండ్.
సంపత్-మౌనిక చాలారోజులుగా రిలేషన్ లో ఉన్నారు. మౌనిక సంపత్ లకి 2021 లోనే రోక జరిగింది. ఏడాది తిరిగేలోపు పెళ్లి కూడా చేసుకుంటాము అని మౌనిక చెప్పింది. ఆ తర్వాత వీరిమధ్యన చిన్న చిన్న విభేదాలు రావడంతో పెళ్ళికి టైం తీసుకున్నారు. అన్ని సమస్యలు సద్దుమణగగా.. గత ఏడాది నవంబర్ లో పసుపు ఫంక్షన్, పెళ్లి కోసం కల్యాణ మండపం కూడా బుక్ చేసారు. ఈ నెల 28 న పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి మరో వారం రోజుల్లో అనగా.. సంత్ వినయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
వారంలో పెళ్లి అనగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నాకు నచ్ఛలేదు, ఏ అమ్మాయి అయినా ఎలా తట్టుకుంటుంది. అందుకే తాను కేసు పెట్టి ఉంటుంది. ఏదైనా ఇద్దరూ కూర్చుని సమస్యని సాల్వ్ చేసుకోవాలి. లేదంటే విడిపోవాలి, మాట్లాడానికి ఇంటికి వెళితే షణ్ముఖ్ లోపలి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు. మౌనిక చాలామంచిది. సెన్సిటివ్. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. ఆమె కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది అంటూ గీతూ రాయల్ షణ్ముఖ్ కేసుపై స్పందించింది.