నిన్న గురువారం యూట్యూబర్ షణ్ముఖ్ ఆయన సోదరుడు పోలీసులకు గంజాయితో పట్టుబడడం సంచలనంగా మారింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మౌనిక అనే అమ్మాయిని చీట్ చేసిన కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులకి షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పట్టుబడడం, అక్కడే ఇంట్లో గంజాయి పాకెట్స్ కూడా దొరకడం మీడియా లో సెన్సేషన్ అయ్యింది. మౌనిక అనే అమ్మాయికి యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తామని షణ్ముఖ్ ఆయన సోదరుడు మోసం చెయ్యడమే కాకుండా తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని వాడుకుని మరో అమ్మాయితో పెళ్ళికి సిద్దమైన షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై మౌనిక పోలీసులకి ఫిర్యాదు చేసింది.
అయితే షణ్ముఖ్ కేసుని వాదిస్తున్న లాయర్ సుంకర దిలీప్ తన క్లయింట్ షణ్ముఖ్ నిర్దోషి అని, అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది, షణ్ముఖ్ సోదరుడు మౌనికని ఎప్పటినుంచో ప్రేమించాడు, పెళ్లి చేసుకోవానుకున్నాడు. కానీ వారి మధ్యన విభేదాలు తలెత్తాయి. విడిగా ఉంటున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 40 లక్షలు ఖర్చు పెట్టారు, మా దగ్గర ఆధారాలున్నాయి. అమ్మాయి మోసం చేసారు అంటూ కేసు పెట్టింది, కానీ ఆమె తల్లితండ్రులు కేసు పెట్టలేదు. షణ్ముఖ్ క బ్యాచిలర్, అతని ఇంటికి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూఉంటారు.
ఆ సీసీ టివి ఫుటేజ్ మా దగ్గర ఉంది. సంపత్ వినయ్ కోసమే పోలీసులు వచ్చారు. ప్లాట్ కి వచ్చినప్పుడు షణ్ముఖ్ ఒక్కడే ఉన్నాడు. అతను పోలీసులకి సహకరించలేదు. దానితో అతన్ని లోతుగా విచారణ చెయ్యడానికి మాత్రమే తీసుకెళ్లారు. అతని ఇంట్లో గంజాయి దొరికింది అంటున్నారు. ఇది పోలీసుల కోణంలోనే జరిగింది. అసలు షన్ను ఇంట్లో ఆ గంజాయి ఎవరు పెట్టారో అనేది తెలియాలి. ఆ గంజాయి ఎవరిది అనేది ఆధారాలతో సహా పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. షణ్ముఖ్ పోలీసులకి సహకరిస్తాడు. షణ్ముఖ్ పై మీడియాలో వస్తున్న కథనాలకు ఎలాంటి సంబంధం లేదు. షణ్ముఖ్ తప్పు చేశాడా, లేదా అనేది కోర్టు మాత్రమే నిర్ధారిస్తుంది అంటూ దిలీప్ సుంకర తన క్లయింట్ తప్పు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.