Advertisementt

టికెట్ ఇవ్వకుంటే ఓకే.. ఇచ్చినా వీడటం వెరైటీ..

Thu 22nd Feb 2024 05:54 PM
tdp  టికెట్ ఇవ్వకుంటే ఓకే.. ఇచ్చినా వీడటం వెరైటీ..
YCP collapse in Nellore district..! టికెట్ ఇవ్వకుంటే ఓకే.. ఇచ్చినా వీడటం వెరైటీ..
Advertisement

రాజకీయాల్లో కొందరు మాత్రమే పార్టీని కష్టంలోనూ సుఖంలోనూ అంటిపెట్టుకుని ఉంటారు. పార్టీలో ఉండాలంటే ఏదో ఒక పదవి కావాల్సిందే.  ఇక ఎన్నికలు వస్తున్నాయంటే టికెట్ మస్ట్‌గా చేతిలో పెడితే ఓకే.. లేదంటే జంప్ అన్నట్టుగా రాజకీయ నేతలు మారిపోయారు. అయితే వైసీపీలో మాత్రం నేతలు రివర్స్‌లో ఉన్నారు. టికెట్ ఇస్తున్నా కూడా పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పార్టీ వీడటానికి కారణాలు ఏవేవో చెబుతున్నప్పటికీ లోగుట్టు మాత్రం వేరే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీనికి కారణమైతే వైసీపీని మునిగిపోయే నావగానే అంతా చూస్తున్నారు. ఈ క్రమంలోనే నావ నుంచి సేఫ్‌గా బయటపడి రాజకీయ జీవితాన్ని కాపాడుకుంటున్నారట.

ఇద్దరూ టీడీపీలోకే...! 

తాజాగా వైసీపి రాజ్యసభ సభ్యుడు, పార్టీలో చాలా సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా నడిచారు. పార్టీతో పాటు టీటీడీ సభ్యత్వానికి ప్రశాంతి రాజీనామా చేశారు. వీరిద్దరూ టీడీపీలోకి జంప్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. వీరిద్దరే కాదు.. నర్సాపురం వైసీపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వంటి వారంతా ముందుగానే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేమిరెడ్డి నెల్లూరు ఎంపీ టికెట్ ఫిక్స్ అయ్యింది. అయినా సరే ఆయన పార్టీని వీడారు. శ్రీకృష్ణ దేవరాయలుకు గుంటూరు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా జంప్.

నెల్లూరు జిల్లాలో వైసీపీ కొలాప్స్..!

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకే చెందిన ముగ్గురు సీనియర్ నేతలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి)లను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఇప్పుడు ఈ వరుసలోకి వేమిరెడ్డి కూడా వచ్చి చేరారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో వైసీపీ దాదాపు కొలాప్స్. పార్టీ టికెట్స్ కోసం పోటీ పడటం సర్వసాధారణం. పార్టీని వీడేందుకు పోటీ పడటం వెరైటీ. అది కూడా ఇచ్చిన టికెట్‌ను సైతం కాదనుకుని. ఈ ఘనత జగన్ పార్టీకి మాత్రమే చెందుతుందేమో.. మొత్తానికి వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేలడంతోనే నేతలంతా గట్టు దాటుతున్నారని అంతా అనుకుంటున్నారు.

YCP collapse in Nellore district..!:

Two rebel YSRCP MLAs join TDP

Tags:   TDP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement