యూట్యూబర్ గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ ఆ తర్వాత బిగ్ బాస్ టైటిల్ ఫెవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి హౌస్ లో సిరితో చేసిన స్నేహం వలన తెగ పాపులర్ అయ్యాడు. నెటిజెన్స్ తో తిట్లు తిన్నాడు. హౌస్ లోకి టైటిల్ ఫెవరెట్ గా వెళ్లి బయటికి రన్నర్ గా వచ్చాడు. వచ్చాక గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ హౌస్ లో చేసిన అతి వలన బ్రేకప్ చెప్పింది. ఆ తరవాత ఎవ్వరికి కనిపించకుండా తన పని తాను చేసుకుంటున్న షణ్ముఖ్ ఆ మధ్యన ఓ యాక్సిడెంట్ కేసుతో మీడియాకి అడ్డంగా దొరికిపోయాడు.
అయితే ఇన్నాళ్లకి మళ్ళీ షణ్ముఖ్ పేరు మరో కేసు తో హైలెట్ అయ్యింది. అది షణ్ముఖ్ తన ఇంట్లోనే గంజాయితో పట్టుబడడం అందరిని షాక్ కి గురి చేసింది. అసలు విషయం లోకి వెళితే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో ఇరుక్కోవడంతో వినయ్ ని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకి షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ దొరకడం కలకలం సృష్టించింది. షణ్ముఖ్ సోదరుడు ఆ అమ్మాయిని పదేళ్లుగా ప్రేమించి మూడేళ్ళ క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని కొద్దిరోజులుగా ఆమెని దూరం పెట్టేసాడు. ఈమధ్యన మరో అమ్మాయిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకోవడంతో వినయ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వినయ్ పై కేసు పెట్టింది.
ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వినయ్ ని అరెస్ట్ చేసేందుకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ నివాసానికి వెళ్లగా.. అక్కడ షణ్ముఖ్ ఒక్కడే గంజాయి సేవిస్తూ కనిపించడంతో పోలీసులు ఇమ్మిడియట్ గా షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు పెట్టిన యువతి కూడా పోలీసులతో పాటు వినయ్ ప్లాట్ కి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ పోలీస్ ల ఎదుటే అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. సంపత్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.