Advertisementt

పుష్ప 2 లో ఐటెం గర్ల్ మారిపోయింది

Wed 21st Feb 2024 07:21 PM
pushpa 2  పుష్ప 2 లో ఐటెం గర్ల్ మారిపోయింది
Nora Fatehi to step in Pushpa as item girl? పుష్ప 2 లో ఐటెం గర్ల్ మారిపోయింది
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ చిత్రం కంటెంట్ పరంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ కూడా అంతే పెద్ద సూపర్ హిట్ అయ్యింది. అందులోను హీరోయిన్ సమంత ఊ అంటావా మావ ఊఉ అంటావా మావా సాంగ్ లో అల్లు అర్జున్ తో వేసిన స్టెప్స్ ఇప్పటికీ యూత్ ని ఉర్రుతలూగిస్తూనే ఉంది. దానితో పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ లో ఏ భామతో ఐటెం సాంగ్ చేయిస్తారో అనే క్యూరియాసిటీతో అల్లు ఫాన్స్ తో పాటుగా యూత్ ఉన్నారు.

సమంతనే మరోసారి పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం తీసుకుంటారనే మాట వినిపించినా తాజాగా పుష్ప 2 లోకి మరో భామ వచ్చి చేరింది అనే టాక్ మొదలయ్యింది. పుష్ప 2 లోను క్రేజీ ఐటెం సాంగ్ ని దేవిశ్రీ కంపోజ్ చేసాడని, ఇప్పటికే పాట కంపోజింగ్ పూర్తయింది, దేవిశ్రీ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్ బాగా కుదిరాయని తెలుస్తుంది. అయితే ఈ పాట కోసం ఫ్రెష్ భామ ఉండాలనే ఆలోచనతో  సుకుమార్ బాలీవుడ్ నటి నోరా ఫతేహిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఊ అంటావా పాటకి మించి ఈ సాంగ్ ఉంటుంది అని చిత్ర బృందం కూడా కాన్ఫిడెన్స్ గా చెబుతుంది. 

Nora Fatehi to step in Pushpa as item girl?:

Pushpa 2 update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ