క్యూట్ అండ్ ట్రెడిషనల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం గ్లామర్‌గా టర్న్ అయ్యింది. కార్తికేయ 2లో మోడరన్‌గా కనిపించినా.. ఎక్కడ గ్లామర్ షో చేస్తూ హద్దు దాటలేదు. కానీ ఈమధ్యన అనుపమ రౌడీ బాయ్స్, అలాగే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్‌లో డోస్ పెంచేసింది. టూ మచ్ గ్లామర్ షో చేస్తుంది. ఎప్పుడూ సాంప్రదాయ పద్దతిలో కనిపించే అనుపమ ఇలా గ్లామర్ రోల్స్‌కి షిఫ్ట్ అవడం ఆమె అభిమానులకి అస్సలు నచ్చడం లేదు.
ఇక టీజె టిల్లు స్క్వేర్‌లో అనుపమ బోల్డ్‌గా రెచ్చిపోయింది. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లోనే అనుపమ ఎలాంటి కేరెక్టర్ చేసిందనేది అర్థమైంది. మరి ఇలాంటి కేరెక్టర్ కోసం అనుపమ ఎంత పారితోషకం అందుకుని ఉంటుందో అనే విషయంలో ఆమె అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటివరకు కోటి నుంచి కోటిన్నర అందుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ కోసం రెండు కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటుందట.
మరి ఎప్పుడూ ట్రెడిషనల్‌గా కనబడే అమ్మాయి ఇప్పుడు మోడరన్‌గా గ్లామర్ షో చేయబట్టే.. అనుపమ రేటు పెరిగింది అంటూ ఫిలిం సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి. మరి ఇదే గ్లామర్ ట్రీట్‌ని అనుపమ కంటిన్యూ చేస్తుందో.. లేదో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఇలా చూస్తూ ఉండాల్సిందే.