Advertisementt

అందుకే లావణ్యతో ఇటలీలో పెళ్లి: వరుణ్ తేజ్

Tue 20th Feb 2024 08:26 PM
varun tej  అందుకే లావణ్యతో ఇటలీలో పెళ్లి: వరుణ్ తేజ్
Varun Tej reveals why he married Lavanya Tripathi in Italy అందుకే లావణ్యతో ఇటలీలో పెళ్లి: వరుణ్ తేజ్
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో గత ఏడాది వివాహం చేసుకున్నాడు. అయితే వరుణ్ తేజ్ వివాహం ఇండియాలో జరగలేదు. ఇటలీ లో వరుణ్ తేజ్, లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసాడు. అదిగో లావణ్య-వరుణ్ తేజ్ ల ప్రేమ ఇటలీలోనే పుట్టింది.. మిస్టర్ చిత్రం షూటింగ్ సమయంలో ఇరువురి మధ్యన ప్రేమ చిగురించింది.. అందుకే ఈ జంట ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్నారు అన్నారు. ఈ వివాహానికి మెగా ఫ్యామిలోని చిన్నాపెద్దా అందరూ హాజరయ్యారు.

అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వివాహం ఎందుకు చేసుకున్నారో అసలైన స్పష్టత ఎవ్వరికీ లేదు. తాజాగా వరుణ్ తేజ్ తన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రమోషన్స్ లో మీడియా మిత్రులు ఇటలీలో పెళ్లి విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకతప్పలేదు. వరుణ్‌ తేజ్ లావణ్య త్రిపాఠిని ఎందుకు ఇటలీలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనే విషయమై స్పందించాడు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఇండియాలో అందులోను హైదరాబాద్ లో పెళ్లి అయితే ఎవరి పనుల్లో వారు ఉంటూ పెళ్లిని ఎక్కువగా ఎంజాయ్‌ చెయ్యలేరు.

అలాగే సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. అదే ఇటలీలో అయితే తమ పనులన్నీ పక్కకు పెట్టి మరీ పెళ్లిని ఎంజాయ్ చేస్తారు. అందుకే మా పెళ్లిని ఇటలీలో ప్లాన్‌ చేశామని వరుణ్ అన్నాడు. మరి వరుణ్ తేజ్ చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. హైదరాబాద్ లో పెళ్లి అంటే ఆ నిమిషానికి వస్తారు వెళ్ళిపోతారు. విదేశాల్లో అయితే గనక పనిగట్టుకుని వెళ్లి వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తారు.

Varun Tej reveals why he married Lavanya Tripathi in Italy:

Varun Tej Reveals Why He Chose To Get Married To Lavanya Tripathi In Italy

Tags:   VARUN TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ