ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన, నటిస్తున్న సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వక ఫాన్స్ పదే పదే డిస్పాయింట్ అవుతున్నారు. ఎప్పటినుంచో అదే జరుగుతుంది. గత ఏడాది సలార్ విషయంలో అదే జరిగింది. ఇప్పడు కల్కి విషయంలో అదే జరుగుతుంది అనే అనుమానాలు సోషల్ మీడియాలో ఎక్కువవుతున్నాయి. జనవరిలో విడుదల కావాల్సిన నాగ్ అశ్విన్-ప్రభాస్ ల కల్కిని మే 9 కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. సరే మే 9 వైజయంతి మూవీస్ కి కలిసొచ్చిన డేట్.. సో కల్కి కూడా హిట్ అవుతుంది అనుకున్నారు
ఇంకేంటి కల్కి మే 9 కి వస్తుంది.. ఇకపై కల్కి అప్ డేట్స్ తో తడిచిపోవడం ఖాయమనే ఆనందంలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. కాని ఇప్పుడు మే 9 న కల్కి విడుదలయ్యే ఛాన్స్ లేదు, నాగ్ అశ్విన్ కల్కి గ్రాఫిక్స్ కోసం కష్టపడుతున్నారు. బెటర్ గ్రాఫిక్స్ కోసం కల్కిని పోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చనే మాట వినిపిస్తోంది. కల్కి హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతోంది. సినిమాని చాలా భాషల్లో రిలీజ్ చేయాలి. ఈపాటికి కల్కి షూటింగ్ పూర్తవ్వాలి, అలాగే నాగ్ అశ్విన్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి ఉంది.
కానీ షూటింగ్ ఓ కొలిక్కి రాలేదు, ఇంకా పబ్లిసిటీ పనులు మొదలు కాలేదు, మేకర్స్ కూడా హడావిడి మొదలు పెట్టలేదు. అందుకే కల్కి మే 9 నుంచి కూడా పోస్ట్ పోన్ అవ్వొచ్చు అంటూ వస్తున్న వార్తలతో ప్రభాస్ అభిమానులు డిస్పాయింట్ మోడ్ లోకి వెళుతున్నారు.