ఈ బుధవారం గోవాలో తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు నడిచేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ రెడీ అవ్వగా.. మరో హీరోయిన్ మాత్రం కజిన్ హల్దీ వేడుకల్లో హడావిడి చేస్తుంది. ఆమే రాశి ఖన్నా. కొద్దిరోజులుగా హిందీలో హల్చల్ చేస్తున్న రాశి ఖన్నా ప్రస్తుతం షూటింగ్స్ కి చిన్న బ్రేకిచ్చి కజిన్ పెళ్ళిలో హంగామా మొదలు పెట్టింది. హల్దీ వేడుకల్లో భాగంగా రాశి ఖన్నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. గడిచిన రెండు రోజులు చాలా సరదాగా గడిచిపోయాయని అంటున్న రాశి ఖన్నా.. చాలారోజుల తర్వాత తెలిసిన వాళ్ళని చుట్టాలని కలవడం హ్యాపీ గా ఉంది అని చెప్పుకొచ్చింది.
నేను ఎంతో ఇష్టపడే చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా అనిపించింది.. అంటూ ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన పిక్స్ ని ఇన్స్టాలో షేర్ చేసింది. రాశి ఖన్నా ఈమధ్యన హిందీలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి రాశి ఖన్నా నటించిన యోధా విడుదలకు సిద్దమవుతుంది. తాజాగా విడుదలైన యోధా టీజర్ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.