Advertisementt

రవితేజ లైనప్ చూసారా..

Tue 20th Feb 2024 10:22 AM
ravi teja  రవితేజ లైనప్ చూసారా..
Speculation on Ravi Teja next రవితేజ లైనప్ చూసారా..
Advertisement
Ads by CJ

రవితేజ వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఉన్నాడు. ధమాకా, వాల్తేర్ వీరయ్య తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరావు, నిన్నగాక మొన్న వచ్చిన ఈగల్ మూడు చిత్రాలు రవితేజని డిస్పాయింట్ చేసాయి. ప్రస్తుతం రవితేజ తనకి మిరపకాయ్ లాంటి సక్సెస్ ఇచ్చిన హారిష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. వరస వైఫల్యాలు చుట్టుముట్టినా రవితేజ వెనకడుగు వెయ్యకుండా వరస చిత్రాలు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా వున్న రవితేజ తన తదుపరి మూవీ ని జాతి రత్నాలు ఫేమ్ తో చేస్తాడని టాక్ ఉంది.

దర్శకుడు అనుదీప్ తో రవితేజ తన తదుపరి మూవీని మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ సమ్మర్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి రవితేజ-అనుదీప్ కాంబో మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తారట మేకర్స్. ఈ చిత్రం తర్వాత రవితేజ సుధీర్ వర్మతో మూవీ చేస్తాడని సోషల్ మీడియా టాక్. మరి రవితేజ వరస సినిమాల లైనప్ బావున్నా.. ఆయన కథలపై ఫోకస్ పెడితే ఇలా వరసగా డిజాస్టర్స్ లు తప్పుతాయని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

చేతిలో సినిమాలెన్ని ఉన్నా.. కథా బలం ఉంటేనే అది హిట్ అవుతుంది. ఇక హరీష్ శంకర్ తో రవితేజ వీలైనంత త్వరగా మిస్టర్ బచ్చన్ ముగించే ఆలోచనలో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యేసరికి హరీష్ కూడా ఈ ప్రాజెక్ట్ ముగించాల్సి ఉంది. 

Speculation on Ravi Teja next:

New and Upcoming Movies Of Ravi Teja

Tags:   RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ