Advertisementt

మెగా హీరో కష్టానికి ఫలితం దక్కేనా?

Tue 20th Feb 2024 09:53 AM
varun tej  మెగా హీరో కష్టానికి ఫలితం దక్కేనా?
Varun Tej desperate for a hit మెగా హీరో కష్టానికి ఫలితం దక్కేనా?
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ వరస వైఫల్యాలతో కెరీర్ లో డల్ అయ్యాడు. గత ఏడాది గాండీవధార అర్జున ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ గా తెలుగు, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పెళ్లి అయిన వెంటనే పనిలోకి దిగిపోయి తన ఆపరేషన్ వాలెంటైన్ ని ప్రమోట్ చేస్తున్నాడు. హైదరాబాద్ ముంబై అంటూ తెగ తిరిగేస్తున్నాడు.

వరస ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. హీరోయిన్స్ తో కలిసి మీడియా ముందే నిలుస్తున్నాడు. తరచూ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్నాడు. గత ఏడాది పెళ్లి కోసం వారం బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ మిగతా సమయం మొత్తం ఈ చిత్రం కోసమే కేటాయిస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ ఎఫర్ట్స్ కి ఆపరేషన్ వాలెంటైన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో కానీ.. నెటిజెన్స్ మాత్రం మెగా హీరో కష్టానికి ఫలితం దక్కేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈరోజు ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ట్రైలర్ రాబోతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ విడుదల చేస్తుండగా.. తెలుగులో రామ్ చరణ్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నాడు.

Varun Tej desperate for a hit:

Varun Tej banks heavily on Operation Valentine

Tags:   VARUN TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ