తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతి క్షణం అనుసరించే ఏపీ సీఎం జగన్.. కొన్ని విషయాల్లో మాత్రం అనుసరించడం లేదు. నిజానికి కేసీఆర్ అహంభావి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన పార్టీ బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక కారణం. అయితే అలాంటి అహంభావి కూడా ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టింది లేదు.. జైళ్లకు పంపించిందీ లేదు.. ఆందోళనలను అడ్డుకున్నది అంతకన్నా లేదు. కానీ జగన్ మాత్రం దీనికి రివర్స్. ఎక్కడ ఆందోళన జరగబోతోందని తెలిసినా కూడా ముందస్తు అరెస్టులు.. ప్రతిపక్ష నేతలపై ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి? చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నారు.
ఎవరినీ టచ్ చేయలేకపోయారు..
తొలుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయనను ఎంతో కాలం పాటు జైలులో నిర్బంధించలేకపోయారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించారు. ఎన్నికల వరకూ బయటకు రానివ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఈ లోపే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ తదితర నేతలందరినీ జైలు పాలుచేయాలని చూశారు. కానీ చంద్రబాబును రెండు నెలల పాటు కూడా జైలులో నిర్బంధించలేకపోయారు. ఇక లోకేష్ సహా ఇతర నేతలెవరినీ టచ్ కూడా చేయలేకపోయారు. అయితే చంద్రబాబు అరెస్ట్ వైసీపీ చేసిన చాలా పెద్ద తప్పిదం. దీంతో వైసీపీ కష్టాల్లో పడింది. తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది.
కట్టడి చేయడానికి కేసా?
ఇక ఇప్పుడు కొత్తగా జగన్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయించింది. ఇది ఇప్పటికి సంబంధించి కాదు.. గత ఏడాది వారాహి యాత్రలో వలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చాలా అనుచితంగా మాట్లాడారని.. ఆ మాటలతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని.. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొందరు వలంటీర్లతో ఫిర్యాదు చేయించింది. గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు నమోదైంది. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పవన్‌పై సెక్షన్స్ 499, 500 కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. మార్చి 25న జరిగే విచారణకు హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్‌కు నోటీస్ పంపింది. షెడ్యూల్ విడుదల కావడానికి ముందు ఇలా పవన్‌పై కేసు నమోదు చేయించడానికి కారణం ఆయనను కట్టడి చేయడానికేనని ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. చంద్రబాబుపై కేసుతో వైసీపీ నష్టపోవడమే తప్ప సాధించిందేమీ లేదు. ఇక పవన్‌పై కేసేు పెట్టి ఏం సాధిస్తుందో చూడాలి.