ట్రెడిషనల్ గర్ల్ గా, పక్కింటి అమ్మాయిగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ కొద్దిరోజులుగా గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియాలోనే కాదు ఆమె నటిస్తున్న సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి. అనుపమని సాంప్రదాయ పాత్రల్లో చూసిన ఆమె అభిమానులు ఇప్పుడు బోల్డ్ కేరెక్టర్స్ లో చూసి తట్టుకోలేకపోతున్నారు. గ్లామర్ షో చేసేది ఫాన్స్ కోసము, యూత్ కోసమే. కానీ అనుపమ పరమేశ్వరన్ అభిమానులు మాత్రం ఆమె గ్లామర్ షో చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు.
టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అనుపమ పరమేశ్వరన్ అభిమాని ఒకరు.. అనుపమ గారు నా ఆటో లో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా.. ఒకప్పుడు మీరు ఎలాంటి సినిమాలు చేసారు, అ.. ఆ సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడని వారుంటారా.. మీరు శతమానం భవతి లో చేసిన కేరెక్టర్, అందులో మీ లుక్ చూసి అసలు మరదలు అంటే మీలా ఉండాలనేలా చేసారు.. అదొక్కటే కాదు ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలు ఎంత బావుంటాయండి. హలొ గురు ప్రేమ కోసమే లో మీరు కాఫీ సీన్ చేసినప్పుడు అందులో ఉన్నది మీరేనా అని మేమెంత కంగారు పడ్డామండి.
కానీ ఇప్పుడు మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి.. రౌడీ బాయ్స్, టిల్లు 2. ఎందుకండీ ఇలాంటి సినిమాలు. ఒకప్పుడు సావిత్రి, సౌందర్య గారు ఎలాంటి సినిమాలు చేసారు. వారిలాగే మిమ్మల్నీ అనుకున్నాము, కానీ మీరు అలాంటి సినిమాలు చెయ్యడం మాకు అస్సలు నచ్చడం లేదు. కొద్దిగా మంచి సినిమాలు చెయ్యండి అంటూ ఆమె అభిమాని చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.