పవన్ కళ్యాణ్-క్రిష్ కలయికలో పిరియాడికల్ డ్రామాగా మొదలై చాలావరకు షూటింగ్ చేసుకున్న హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ ఆగిపోయి అప్పుడే ఏడాదిన్నర కావొస్తుంది. గత ఎడాది పవన్ బ్రో చిత్రం విడుదల చెయ్యగా.. ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తో OG చిత్ర షూటింగ్స్ లో పాల్గొని హరి హర వీరమల్లుని పక్కనబెట్టయ్యడంతో ఆ చిత్రం ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఈమధ్యన మళ్ళీ హరి హర వీరమల్లు పై ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో కనబడుతుంది.
తాజాగా హరి హర వీరమల్లు జాతర ఈ మహాశివరాత్రి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడమే కాదు.. ట్విట్టర్ X లో #HariHaraVeeramallu హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వీరమల్లు జాతర ఈ మహా శివరాత్రి కానుకగా అయితే ఉంటుంది అంటూ పవన్ ఫాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. మరి మార్చ్ 8 మహా శివరాత్రి. ఆ రోజు హరి హర వీరమల్లు నుంచి ఎలాంటి ట్రీట్ ఉంటుందో తెలియదు, కానీ పవన్ ఫాన్స్ మాత్రం హరి హర వీరమల్లుపై నమ్మకం పెట్టుకున్నారు.
నెటిజెన్స్ మాత్రం చప్పుడు లేని పవన్ సినిమా కి అప్ డేట్ జాతరంట అంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ కాగా, క్రిష్ అనుష్క తో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం షూటింగ్ తో బిజీగా వున్నారు.