ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగిన రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహానికి అమ్మమ్మ విజయమ్మ సహా బంధుమిత్రులంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. కానీ మేనమామ జగన్ ఎక్కడ? నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అన్నీ తానై రాజారెడ్డి వివాహం జరిపించేవారు. మరి తండ్రి తర్వాత తండ్రి అంతటోడు అయిన జగన్ ఈ వివాహాన్ని తన భుజస్కందాలపై వేసుకుని జరిపించాలి కదా? ఏరి.. ఎక్కడ? అడ్రస్ లేరే?
జగన్ సతీమణి భారతి ఏం చేస్తున్నట్టు?
రాజకీయాల్లో బిజీగా ఉండొచ్చుగాక. తన మేనల్లుడి వివాహం కంటే ఎక్కువా? ఒకరోజు వివాహానికి కేటాయించినంత మాత్రాన పరిస్థితులేమీ తారుమారవవుగా.. పోనీ జగన్ సతీమణి భారతి ఏం చేస్తున్నట్టు? ఆమె ఫ్రీగానే ఉన్నారు కదా.. ఆమెనైనా పంపించి ఉంటే జగన్‌కు ఎంత గౌరవంగా ఉండేది? ఇలాంటివి చూసే జనాలు షర్మిల సైడ్ నిలుస్తున్నారు. అన్న రోడ్డున పడేసినా కూడా షర్మిల.. తెలంగాణకు వచ్చి తన రాజకీయమేదో తాను చేసుకున్నారు తప్ప అన్నను పల్లెత్తి మాట అన్న పాపాన పోలేదు. తెలంగాణలో షర్మిల ఎన్ని అవమానాలు పడుతున్నా కూడా జగన్ చూస్తూ ఉండిపోయారే తప్ప ఆమె తరుఫున ఏనాడు మాట్లాడింది లేదు.
తప్పు ఎవరిది అవుతుంది?
చివరకు తనకు అంది వచ్చిన అద్భుత అవకాశాన్ని వినియోగించిన తాను స్థాపించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆపై ఏపీకి అధ్యక్షురాలిగా వచ్చారు. ఇక ఒక పార్టీకి చీఫ్‌గా ఉన్నప్పుడు అధికార పార్టీ తప్పొప్పులను ఎత్తి చూపించాల్సిందే. ఆమె అదే చేస్తున్నారు. పోనీ షర్మిల విమర్శిస్తుంటే జగన్ ఏమైనా కామ్‌గా కూర్చొన్నారా? తన కాలకేయ సైన్యాన్ని ఉసిగొల్పి ఆమెపై మాటల దాడి చేయిస్తూనే ఉన్నారు కదా. అయినా సరే.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే. షర్మిల ఇంట వివాహానికి రాకుంటే తప్పు ఎవరిది అవుతుంది? షర్మిలకు ఆస్తుల పరంగానూ.. రాజకీయపరంగానూ అన్యాయం చేసి ఇంటి నుంచి పంపించేశారు. అయినా సరే... ఆమె తన కుమారుడు, కాబోయే కోడలిని వెంటబెట్టుకుని మరీ జగన్ ఇంటికి వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. రేపు తీరికగా రిసెప్షన్‌కు జగన్ దంపతులు వచ్చినా కూడా ఏముంటుంది. అన్ని దగ్గరుండి జరిపించాల్సిన మేనమామ పెళ్లికి రాకుండా రిసెప్షన్‌కు వస్తే మరోసారి విమర్శలు ఖాయం.