సంక్రాంతికి ఈసారి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. మూడు సినిమాలు ఇండస్ట్రీకి సానుకూలంగా నాలుగో సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేఖంగా విడుదలైన విషయం తెలిసిందే. అవే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు. జనవరి 12 న గుంటూరు కారంతో హనుమాన్ కయ్యానికి కాలు దువ్వగా.. అందులో హనుమాన్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన సైంధవ్ నా సామిరంగాలలో నాసామిరంగా హిట్ అయ్యింది. ఈ చిత్రాలు ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.
గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటీ ప్రేక్షకుల ముందుకు రాగా.. సైంధవ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నా సామిరంగా నిన్న ఫిబ్రవరి 17 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిన్నటి నుంచి నా సామిరంగా సోషల్ మీడియా ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతుంది. థియేటర్స్ లో సాలిడ్ హిట్ అయిన నాగార్జున నా సామిరంగా ఇప్పుడు హాట్ స్టార్ లోను హిట్ అయినట్లుగా అర్ధమవుతుంది. ఈ లెక్కన నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాధ్ లు థియేటర్స్ ఆడియన్స్ ని మాత్రమే కాదు ఓటిటీ ఆడియన్స్ ని కూడా పడేశారన్నమాట.