మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెషనల్ గా ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తారో.. ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మెగాస్టార్ చిరు ఎక్కడికి వెళ్లినా ఆయన భార్య సురేఖ తోడుగానే ఉంటారు. ఎక్కడికెళ్లినా ఆదిదంపతుల్లా సురేఖ-చిరంజీవి కలిసి కనిపిస్తారు ఫ్యామిలీ ఈవెంట్స్, ఫ్రెండ్స్ ఫంక్షన్స్, అలాగే పండగలకు సురేఖతో కలిసి పిక్స్ దిగుతూ ఉంటారు చిరు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా చిరు-సురేఖలు ఫ్రెండ్ ఇంట్లో జరిగే శుభకార్యం కోసం అమెరికా వెళ్లారు. వాలెంటైన్స్ డే రోజున సురేఖకు ప్రేమగా విషెస్ చెప్పారు.
ఇక ఈ రోజు ఫిబ్రవరి 18 న సురేఖ గారి పుట్టిన రోజు. మరి మెగాస్టార్ తన భార్య సురేఖకు బర్త్ విషెస్ ని ఎలా తెలియజేసారో తెలుసా.. ఒక చిరు కవితతో తన భార్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా భార్య సురేఖకు అందజేశారు.
నా జీవన రేఖ
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ అంటూ అందమైన ఫోటోని జోడించి మెగాస్టార్ భార్యకి విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.