సంక్రాంతి కి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి పెద్ద సినిమాలనే పక్కకి నెట్టి ప్రేక్షకుల నుంచి శెభాష్ అనిపించుకుని థియేటర్స్ లో దుమ్మురేపే కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ లో అద్భుతాలు సృష్టించింది. ప్రశాంత్ వర్మ గ్రాఫిక్స్ తో తేజ సజ్జా ఇన్నోసెంట్ యాక్టింగ్ తో, వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ నటనకి ప్రేక్షకులు ఫిదా అవడమే కాదు.. రిపీటెడ్ గా థియేటర్స్ కి వెళ్లి హనుమాన్ ని వీక్షించారు. చిన్న చిత్రం కాస్తా పెద్ద హిట్ గా నిలిచింది.
దానితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. జనవరి 12, 13, 14 తేదీల్లో విడుదలైన చిత్రాలు గుంటూరు కారం, వెంకీ చిత్రం, నా సామిరంగా అప్పుడే ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. కానీ హనుమాన్ థియేటర్ పెర్ఫర్మెన్స్ బావుండడంతో దానిని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ కాస్త వెనుకాడారు. తాజాగా హనుమాన్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ 5 హనుమాన్ ని త్వరలోనే స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.
మార్చ్ 2 నుంచి హనుమాన్ ని జీ 5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే అధికారికంగా ఈ డేట్ ని ప్రకటిస్తారని సమాచారం.