Advertisementt

పవన్ OG లో అదే హైలెట్ అంట

Sat 17th Feb 2024 10:06 PM
og  పవన్ OG లో అదే హైలెట్ అంట
OG Bang: Fans Are Eagerly Waiting For This! పవన్ OG లో అదే హైలెట్ అంట
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఏపీ లో జరగబోయే ఎన్నికల కసరత్తులో పవన్ ఉన్నారు. గత నెల నుంచి పవన్ సినిమాలకి గ్యాప్ ఇచ్చేసారు. పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తో చేస్తున్న OG చిత్రాల షూటింగ్ కి బ్రేకిచ్చి రాజకీయాలవైపు వెళ్లిన పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చెయ్యలేక హరీష్ శంకర్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టాడు. సుజిత్ కూడా నానితో మూవీ అన్నారు కానీ.. అదేమీ ఇప్పట్లో లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కోసమే సుజిత్ వెయిట్ చేస్తారని తెలుస్తుంది.

సెప్టెంబర్ 27 OG రిలీజ్ అంటూ ప్రకటించారు. ఏప్రిల్ లో ఎన్నికల తర్వాత పవన్ మళ్ళీ OG సెట్స్ కి వస్తారు. అయితే OG లో పవన్ కళ్యాణ్ పాత్ర తాలూకు షూటింగ్ అంత పెద్దగా బాలన్స్ లేదట. రెండు వారాల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే OG షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని తెలుస్తోంది. ఇక ఓజీ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ గా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బిగ్గెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ గా దీనిని సుజిత్ డిజైన్ చేస్తున్నాడంట. 

పవన్ కి సంబంధించి అదిరిపోయే ఎలివేషన్ షాట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ లో మాసివ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని సుజిత్ తెరకెక్కిస్తున్నాడట ఈ సీక్వెన్స్ అన్ని OG లో హైలెట్ అవడమే కాదు పవర్ స్టార్ అభిమానులకి అయితే గూస్ బాంబ్స్ తెప్పించే విధంగా ఉంటాయంట.

OG Bang: Fans Are Eagerly Waiting For This!:

OG movie update 

Tags:   OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ