Advertisementt

బాలీవుడ్ లో తీవ్ర విషాదం

Sat 17th Feb 2024 08:25 PM
dangal  బాలీవుడ్ లో తీవ్ర విషాదం
Dangal Girl Passed Away బాలీవుడ్ లో తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిండా 19 ఏళ్ళు కూడా లేని దంగల్ నటి బబితా ఫోగట్ పాత్ర పోషించిన సుహాని అకాల మరణం అందరిని కలిచి వేసింది. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ లో నటించిన సుహాని భట్నాగర్ ఆరోగ్యపరమైన కారణాలతో మృతి చెందడం అందరిని షాక్ కి గురి చేసింది. దంగల్ చిత్రం తర్వాత వెండితెర మీద కనిపించని సుహాని.. చదువుపై దృష్టి సారించింది. వెండితెర పై కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తో ఎప్పటికప్పుడు ఇంట్రారాక్ట్ అవుతూ ఉండేది. 

సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉండేది. అయితే సుహానికి  కొన్నేళ్ల క్రిందట పెద్ద యాక్సిడెంట్ జరగడంతో ఆమె కాలుకి గాయం అయ్యింది. కాలికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆమె వాడిన యాంటిబయటిక్స్ సుహాని ఆరోగ్యంపై  దుష్ప్రభావం చూపాయి. దానితో సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. ఆమెను కుటుంభ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఎయిమ్స్ లో ఆమెకి ట్రీట్మెంట్ అందించినా లాభం లేకుండా పోయింది. నేడు శనివారం ఆమె పరిస్థితి మరింతగా విషమించడంతో ఒక్కసారిగా హఠాన్మరణం పొందింది. సుహాని మృతి పట్ల బాలీవుడ్ ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Dangal Girl Passed Away:

Dangal Fame Suhani Bhatnagar Dies Due To Health Issues

Tags:   DANGAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ