Advertisementt

ట్రాక్ లోకి వచ్చేసిన సమంత

Sat 17th Feb 2024 06:28 PM
samantha  ట్రాక్ లోకి వచ్చేసిన సమంత
Samantha new look goes viral ట్రాక్ లోకి వచ్చేసిన సమంత
Advertisement
Ads by CJ

సమంత ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ లోకి వస్తుందా అని ఆమె అభిమానులే కాదు.. ప్యాన్ ఇండియా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. గత ఆరేడునెలలుగా సినిమా షూటింగ్స్ కి దూరంగా హెల్త్ ట్రీట్మెంట్ లో ఉండిపోయింది. మధ్య మధ్యలో సాకి పబ్లిసిటీ కోసం కెమెరా ముందుకు వచ్చిన సమంత ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంటుంది. టూ గ్లామర్ షోతో తరచూ మోడ్రెన్ డ్రెస్సులతో అందరి చూపు తనపైనే ఉండేలా, అందరూ తన గురించి మట్లాడుకునేలా చేసుకుంది.

ఇక ఈ మధ్యన సమంత తాను మళ్ళీ షూటింగ్స్ కి హాజరవుతాను, అది కూడా అతి త్వరలోనే అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆమె ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సమంత ని సినిమా సెట్స్ లో చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత ఓ పబ్లిక్ ఈవెంట్ కి హాజరైంది. ఆమె ఫేస్ లో గ్లో చూసి అందరూ సమంత ట్రాక్ లోకి వచ్చేసింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఖుషి చిత్రంలో సమంత లుక్స్ విషయంలో తీవ్ర విమర్శల పాలైంది. కానీ ఇప్పుడు సమంత తన మొహం లో మునుపుటి కళని తిరిగి తెచ్చుకుంది అనేలా ఆమె లుక్ ఉంది.

లూజ్ హెయిర్ తో క్రీమ్ కలర్ టాప్ తో సమంత చాలా సరదాగా నవ్వుతూ కనిపించింది. మరి సమంత న్యూ లుక్ చూసిన వారు సమంత పూర్తిగా కోలుకుంది.. ఇకపై ఆమె సినిమాలు ఓకె చెయ్యడమే తరువాయి అంటున్నారు.

Samantha new look goes viral:

Samantha new stylish look goes viral

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ