మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం చిత్రానికి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నిర్మాతలు కలెక్షన్స్ పరంగా బావుంది అన్నప్పటికీ.. బయ్యర్లకి ఈ చిత్రం ఎంతో కొంత నష్టాలే మిగిల్చింది. థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. రీసెంట్ గానే గుంటూరు కారం చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ రచయిత పరచూరి గోపాల కృష్ణ ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
గుంటూరు కారం మహేష్ బాబు స్థాయి సినిమా కాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అసలు ఆ చిత్రానికి ఆ టైటిల్ కూడా కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం పడ్డారు. గుంటూరు కారం కథనం నాకు కన్ఫ్యూజన్ గా అనిపించింది. ప్రేక్షకులకి ఏం అర్ధం అయ్యిందో తెలియదు కానీ.. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో ఆడుకున్నాడు. గుంటూరు కారం టైటిల్ కి తగ్గట్టే మహేష్ కేరెక్టర్ ని డిజైన్ చేసాడు. ఆయన సినిమాల్లో ఇది కాస్త డిఫరెంట్ గా కనిపించింది. త్రివిక్రమ్ టైటిల్స్ కూడా బాగా పెడతారు. ఈ చిత్రంలో తల్లి కొడుకుల మధ్యన సంఘర్షణ వర్కౌట్ అవ్వలేదు.
తల్లి-కొడుకు, తాత-మనవడు సెంటిమెంట్ పండలేదు. హీరో అమ్మ ని దైవంలా చూస్తాడు కానీ.. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. సెంటిమెంట్ ఆధారంగా సినిమా చేస్తే బావుండేది. గుంటూరు వారి అబ్బాయి అనే టైటిల్ పెడితే ఫ్యామిలీ చిత్రాన్ని చూడబోతున్నామని ఆడియన్స్ ఫీలయ్యేవారు. ఇక హీరోయిన్ సంతకం కోసం హీరో ఇంటికి వచ్చి అలా ప్రేమలో పడేసేందుకు ట్రై చేసిన విధానం ఏమాత్రం బావుండలేదు అంటూ పరచూరి గుంటూరు కారం పై తన రివ్యూని అందించారు.