Advertisementt

ఫేక్ న్యూస్: మహేష్-రాజమౌళి ఓ టైటిల్

Sat 17th Feb 2024 01:22 PM
mahesh babu  ఫేక్ న్యూస్: మహేష్-రాజమౌళి ఓ టైటిల్
Fake News: Rajamouli and Mahesh Babu Titles ఫేక్ న్యూస్: మహేష్-రాజమౌళి ఓ టైటిల్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళి తో చెయ్యబోయే SSMB29 కోసం మేకోవర్ అవుతున్నారు. మహేష్ ఎప్పుడెప్పుడు రాజమౌళితో కలిసి కనిపిస్తారా అని ఆయన అభిమానులు చాలా ఆత్రంగా ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి SSMB29 ని ఫ్లోర్ మీదకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తల మునకలై ఉన్నారు. అయితే SSMB29 మొదలు కావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. కారణం రాజమౌళి ఆస్థాన కెమేరామ్యాన్ సెంథిల్ భార్య కన్ను మూయడంతో సెంథిల్ ఇప్పట్లో SSMB29 ప్రాజెక్ట్ లో అడుగుపెట్టలేరు.

ఈలోపులో రాజమౌళి-మహేష్ కలయికలో మొదలు కాబోయే మూవీ టైటిల్ పై రకరకాల పేర్లు ప్రచారంలోకి తెచ్చారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం ప్యాన్ వరల్డ్ మూవీగా ఉండబోతుంది, దీనికి విజయేంద్ర ప్రసాద్ గారు కథని రెడీ చేసి కూర్చున్నారు. అయితే ఈచిత్రానికి మహారాజ్ కానీ చక్రవర్తి కానీ టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం మొదలైంది. మరి ఈ టైటిల్స్ లో ఏదో ఒకటి పెడతారో.. లేదంటే ఇంకా డిఫరెంట్ గా ఆలోచించి మరో క్రేజీ టైటిల్ ని రాజమౌళి ఎన్నుకుంటారో అని మాట్లాడుకుంటున్నారు. కానీ SSMB29 టైటిల్స్ పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, అదంతా ఫేక్ అంటూ రాజమౌళి కాంపౌండ్ స్పందిస్తుంది.

ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా దీపికా పదుకొనె, అలాగే ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలుస్తుంది SSMB29 లో మహేష్ తో జోడి కట్టబోయే ఆ క్రేజీ బ్యూటీ ఎవరు అనేది.

Fake News: Rajamouli and Mahesh Babu Titles:

Mahesh Babu, Rajamouli Movie: Titles Doing The Rounds Are Fake

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ