Advertisementt

పుష్ప3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్

Sat 02nd Mar 2024 09:09 PM
allu arjun pushpa 3  పుష్ప3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్
Allu Arjun Talks About Pushpa 3 పుష్ప3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప చిత్రం ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప2 పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. దేశం అనే కాదు.. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పుష్ప3 అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పుష్ప2 తర్వాత పుష్ప3 కూడా ఉంటుందని.. అధికారికంగా వార్తలు రాలేదు కానీ.. టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం ఇదో హాట్ టాపిక్ అయింది. 

ఇప్పుడు అఫీషియల్‌గా దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప3 ఉంటుందని స్వయంగా పుష్పరాజే చెప్పేశాడు. అవును.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి జర్మనీ వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడొక ఇంటర్వ్యూలో పుష్ప3 ఉంటుందని.. ఆ ఫెస్టివల్ వేదికగా తెలియజేశారు. దీంతో పుష్ప3 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జునే పుష్ప3 ఉంటుందని ప్రకటించడంతో.. ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బన్నీ ఏమన్నాడంటే.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప2 తర్వాత పుష్ప3 కూడా ఉండొచ్చు. దీనిని మేము ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. పుష్ప3కి లైన్ కూడా సిద్ధంగా ఉంది. పుష్ప కంటే పుష్ప2 భారీ స్కెల్‌లో, పెద్ద కాన్వాస్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్ సిండికేట్‌కి సంబంధించి ఈ పార్ట్2 వైవిధ్యకోణాన్ని చూపిస్తుంది. నా తదుపరి సినిమాలకు సంబంధించి ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు కానీ.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌ మాత్రం లైన్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎపిక్ స్కేల్‌లో ఉంటాయి. పుష్ప ఇచ్చిన ఈ స్కేల్‌ను వదులుకోవడం ఇష్టం లేదు. ఆ స్కేల్ అలా మ్యాగ్జిమమ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నానని.. అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.  

Allu Arjun Talks About Pushpa 3:

Pushpa 2 and Pushpa 3 Updates From Icon Star Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ